పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ ట్రైలర్..ఊరంతా మేక వన్నె పులులే…

-

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇది ఇలా ఉండగా, పాయల్‌ ప్రస్తుతం ఆర్‌ఎక్స్‌ 100 సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి చేస్తున్న మంగళవారం సినిమాలో నటిస్తోంది. ఆర్‌ఎక్స్‌ 100 ఫేం సినిమాతో డైరెక్టర్‌గా అజయ్ భూపతి , హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ మంచి బ్రేక్ అందుకున్నారని తెలిసిందే. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం మంగళవారం. ఫీ మేల్ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌తో హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. అయితే.. కాసేపటి క్రితమే పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవారం సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. మరి మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version