పవన్ సీక్రెట్ బయటపెట్టిన మణిశర్మ..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుపొందిన మణిశర్మ కు మంచి క్రేజ్ ఉన్నది. మొదట రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రాత్రి సినిమాకి సంగీతాన్ని అందించి తన కెరియర్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత బావగారు బాగున్నారా ,గణేష్ ,చూడాలని ఉంది ఇలా ఎన్నో సినిమాలలో ఎంతో మంది హీరోలకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్గా మారారు. అయితే చిరంజీవితో పాటు వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఇలా ఎంతోమంది హీరోల సినిమాలకు కూడా మణిశర్మ సంగీతాన్ని అందించారు.

అయితే 2000లో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రానికి మ్యూజిక్ అందించిన ప్రతిపాట కూడా ఎవరీ గ్రీన్ గా నిలిచింది.ఈ సినిమాలోని పాటలు ఎప్పుడు విన్న చాలా ఫ్రెష్ గానే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ చిత్రం కోసం మొదట ఒకసారి కొత్త ప్రయోగాన్ని కూడా చేశారు. తెలుగు సినిమాలలో కంప్లీట్ గా హిందీ సాంగ్ అనే ట్రెండ్ ని మొదటిసారిగా శ్రీకారం చుట్టారు ఈ చిత్రంతోనే..ఇందులో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ వచ్చే” ఏ మేరా జహ.. ఏ మేరా ఆశియా”అని హిందీ పాట ఈ పాటను తెరకెక్కించడం జరిగింది.థియేటర్లలో ఈ పాట ఒక రేంజ్ లో పాపులర్ అయిందని చెప్పవచ్చు.

ఈ పాట వెనుక ఉన్న అసలు కథను ఇటీవల ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న మణిశర్మ బయట పెట్టడం జరిగింది. మణిశర్మ మాట్లాడుతూ..ఇప్పటికి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ పాట ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట తనది కాదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు తన సినిమాలతో కొత్త తరహా ప్రయోగాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కంప్లీట్ హిందీ సాంగ్ ని చేద్దామని చెప్పారట. ఐడియా కూడా నచ్చడంతో నిర్మాత A.M. రత్నం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. అలా ఈ పాట వినగానే కచ్చితంగా ఈ సాంగ్ హిట్ అవుతుందని మణిశర్మ ముందుగానే ఊహించారట. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఒకటి ట్రెండ్ సెట్ చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version