రవితేజతో లిప్‌ లాక్‌.. యంగ్‌ హీరోయన్‌ హాట్‌ కామెంట్స్‌

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ… యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శ కత్వంలో రూపొందింతున్న ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ రెండు రోజుల కిందట రిలీజ్‌ అయింది.

అయితే.. ఇందులో యంగ్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి.. రవితేజ లిప్‌ లాక్‌ పెడతాడు. దీంతో ఈ సినిమాపై హైప్‌ ఓ రేంజ్‌ కు వెళ్లింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా కిలాడి మూవీ విశేషాలను హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియాతో పంచుకుంది.

“తెలుగు డైలాగులు చెప్పడం నాకు పెద్ద టాస్క్. రవితేజ మూవీ అనగానే వెంటనే అంగీకరించాను. కొన్ని సీన్స్ చేసేటప్పుడు మెరుగ్గా ఉంటే.. కంఫర్ట్ అయ్యే వరకు టైం తీసుకోవాలి అని చెప్పారు. ట్రైలర్ లో ఉన్న కమర్షియల్ సినిమా కాబట్టి కొన్ని అంశాలు ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అవి హ్యూమన్ ఏమోషన్స్”అంటూ మీనాక్షి చౌదరి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news