మెగాస్టార్ చిరంజీవి, సూపర్ టాలెంటెడ్ నయనతార కీలక పాత్రల్లో నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 5 దసరా రోజున ఈ సినిమా థియేటర్ లో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈవెంట్ జరుగుతుండగా మధ్యలోనే భారీ వర్షం కురిసింది.
ఓవైపు భారీగా వాన పడుతున్నా మెగాస్టార్ అభిమానులు వారున్న ప్లేస్ నుంచి కాస్త కూడా కదల్లేదు. మరోవైపు చిరంజీవి కూడా తన అభిమానుల కోసం వర్షంలోనే తన స్పీచ్ ఇచ్చారు. ‘నా వెనక గాడ్‌ఫాదర్స్ లేరని అంతా అంటుంటారు. కానీ, నా అభిమానులే నా గాడ్‌ఫాదర్స్’ అని చిరంజీవి ఉద్వేగభరితంగా అన్నారు. ఈ రోజు ఉదయం సూపర్ స్టార్ కృష్ణగారి సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. ఈ ‘గాడ్ ఫాదర్’ వేదికగా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు.