మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ కొట్టేవారు లేరబ్బా..!!

-

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజం గా అందరికి తెలిసిందే. ఇక తాను అంతకు ముందు సినిమాలను వదిలి తాను బాధపడి, అభిమానులను కూడా భాద పెట్టారు. రాజకీయాలలో ఎంతో మంది ఎన్నో విమర్శలు చేశారు. ఇక మళ్లీ రాజకీయాలు వదిలి సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు.

ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తున్న హీరోలలో చిరంజీవి మాత్రమే ఉన్నారని చెబితే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఒక సంవత్సరం వ్యవధిలో తనవి మూడు సినిమాలు విడుదల అయ్యాయి అంటే తన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇలాంటి రికార్డ్ ఇప్పుడున్న యంగ్ హీరోలకు కూడా సాధ్యం కాదు.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 3 రోజుల్లో 100 కోట్లు వసూళ్లు సాధించి, రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లు కోసం వేగంగా దూసుకొని పోతుంది. ఇక ఈ సినిమా వారం రోజులు మాత్రమే రెస్ట్ తీసుకొని మళ్లీ వెంటనే భోళా శంకర్ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు మెగాస్టార్.

Read more RELATED
Recommended to you

Latest news