ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మీర్జాపూర్‌ 3’ .. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ టాప్​లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సీజన్ 3 కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అని ఉత్కంఠంతో వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రేక్షకులకు మీర్జాపూర్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. సీజన్-3 స్ట్రీమింగ్ డేట్​ను అనౌన్స్ చేశారు. మీర్జాపూర్-3 అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జులై 5 నుంచి ప్రసారం కానున్నట్లు తెలిపారు. దీని షూటింగ్‌ పూర్తయినట్లు ఏడాది క్రితమే నటీనటులు వెల్లడించారు. అప్పటి నుంచి స్ట్రీమింగ్‌ తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దాన్ని ప్రకటించడంతో వారంతా సంబుర పడుతున్నారు. దీని రెండో సీజన్‌ విడుదలై మూడేళ్లు గడిచినా అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్‌లో సందడి చేస్తూనే ఉన్నాయి. క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version