నా గురువులందరికీ కృతజ్ఞతలు : కీరవాణి

-

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుక ఘనంగా ముగిసింది. భారత్ నుంచి ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో నామినేషన్స్ సాధించిగా ఒక అవార్డు సొంతమైంది.

mm keeravani

గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్ ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఎంపిక చేశారు. ఈ అవార్డు ను సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. అయితే, సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో వస్తున్నట్లు తెలుపుతూ ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు. ‘గోల్డెన్ గ్లోబ్ తో సహా ఆర్ఆర్ఆర్ కు వచ్చిన 4 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న తర్వాత తిరిగి ఇంటికి వస్తున్నాను. రామోజీ రావు గారు & నా సంగీతాన్ని తెలుగు రాష్ట్రాల బార్డర్ లను దాటేలా చేసిన గురువులందరికీ కృతజ్ఞతలు. బాలచందర్ సర్, భారతన్ సర్, అర్జున్ సర్జ, భట్ సాబ్ అందరికీ థాంక్స్’ అని ట్విట్ లో పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version