ఆ ఇద్దరు హీరోలే ట్రోలింగ్ చేయిస్తున్నారు, వారికి శిక్ష తప్పదు…. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

-

మంచు ఫ్యామిలీ అంటే తెలుగు ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ తో పాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మీ కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇటీవల ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తలకు దారి తీశాయి.

ఇదిలా ఉంటే అప్పటి నుంచి మంచు ఫ్యామిలీ మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అనేక రకాలుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ట్రోలింగ్ పై మోహన్ బాబు స్పందించారు. సెలబ్రెటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ చూసి చాాలా బాధపడుతున్నానని.. నేను వీటిని సాధారణంగా పట్టించుకోనని.. అయితే కొంత మంది మాత్రం అదే పనిగా ఉంటారని అన్నారు. ఇద్దరు హీరోలు కొంతమందిని పెట్టుకుని ట్రోలింగ్ చేయిస్తున్నారంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు వారికి శిక్ష తప్పదు అంటూ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు వ్యాఖ్యలతో ఆ ఇద్దరు హీరోలు ఎవరా..? అని నెటిజెన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version