#RC 15 సినిమాలో మోహన్ లాల్.. నిజమేనా..?

-

మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది ముఖ్యంగా జపాన్ లో కూడా ఈ సినిమా విడుదలై పలు రికార్డులను సైతం బ్రేక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. RRR చిత్రంలో రామ్ చరణ్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ తో పోటీపడి మరీ నటించారు రామ్ చరణ్.

అల్లూరి సీతారామరాజు పాత్రలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చరణ్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరొకసారి టాప్ డైరెక్టర్ అయిన శంకర్ తో తన తదుపరిచిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఇందులో కనిపించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కియారా హీరోయిన్గా నటిస్తున్నది . అలాగే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలలో సునీల్, శ్రీకాంత్ ,అంజలి కూడా నటించబోతున్నారు. ఈ చిత్రం కూడా ఒక పొలిటికల్ డ్రామా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోలు లో కనిపించబోతున్నట్లు గతంలో లీకైన కొన్ని ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.

ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మలయాళం లో స్టార్ హీరోగా పేరు పొందిన మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని అది కూడా ముఖ్యమంత్రి పాత్రలు కనిపించబోతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news