ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ – ముతయ్య మురళీధరన్

-

ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముతయ్య మురళీధరన్ పేర్కొన్నారు. శ్రీలంక క్రికెటర్ ముతయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీలంక క్రికెటర్ ముతయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారంగా 800 సినిమా తీసారు. అయితే.. శ్రీలంక క్రికెటర్ ముతయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ “హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది.

Muttiah Muralitharan Comments on Hyderabad

ఇప్పుడు చూస్తే ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌గా ఉంది” అన్నారు శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముతయ్య మురళీధరన్. కాగా, శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ గురించి ప్రత్యేకించి తెలుసుకోవలసిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా ఎవ్వరికీ వీలు కాని రికార్డును సృష్టించాడు. తన బౌలింగ్ స్టైల్ తో బ్యాట్స్మన్ లను సగం భయపెట్టే మురళీధరన్ ఈజీ గా వారిని బుట్టలో వేసుకుంటాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version