తాజాగా రామ్ చరణ్ G20 సదస్సులో పాల్గొని పలు విషయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.. జమ్మూ అండ్ కాశ్మీర్ వేదికగా జరిగిన జీ.20 సదస్సులో ఆ గౌరవం అందుకున్న ఏకైక ఇండియన్ హీరోగా ఆయన రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా ఆ సదస్సులో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్న ఆయన ఉపాసన ప్రెగ్నెన్సీ పై ఆసక్తికర కామెంట్ చేయడం గమనార్హం. ఇకపోతే తమకు పుట్టబోయే బిడ్డతో జపాన్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని, ఆ దేశం అంటే ఇప్పుడు ఇష్టం పెరిగింది అని రాంచరణ్ చెప్పుకొచ్చారు.
నాకు యూరప్ అంటే ఎంతో ఇష్టం.. ఇప్పుడు జపాన్ దేశాన్ని కూడా నేను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నా భార్య ఉపాసనకు.. ఇప్పుడు ఏడో నెల.. ఈ మ్యాజిక్ జరిగిందంతా కూడా జపాన్లోనే ..ఆ దేశ ప్రజలు వారి సంస్కృతి నాకు ఎంతో ఇష్టం అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు. ఇకపోతే గత ఏడాది జపాన్ దేశంలో ఆర్ఆర్ఆర్ విడుదల చేయగా ఆ సినిమా ప్రమోషన్స్ కు నేను నా భార్యతో కలిసి అక్కడికి వెళ్లాను. ఆ సమయంలోనే ఉపాసన గర్భం దాల్చింది అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఈ శుభవార్త మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ సందేశం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే పిల్లల విషయంలో సమాజం, కుటుంబ సభ్యుల ఒత్తిడికి మేము తలోగ్గలేదు. ఇది మా మధ్య బంధాన్ని అవగాహన మరింత బలం చేసింది. సమాజంతో పని లేకుండా మేము కావాలనుకున్నప్పుడే తల్లిదండ్రులను అయ్యాము అంటూ ఉపాసన కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తానికి అయితే రామ్ చరణ్, ఉపాసన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.