Naga Chaitanya: యంగ్ హీరో మరో ‘లవ్ స్టోరి’..మ్యారే‌జ్‌కి నాగచైతన్య రెడీ

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రజెంట్ సింగిల్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సమంత నుంచి విడిపోయిన ఈ యంగ్ హీరో తన కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తన ప్రొఫెషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ విషయంలోనూ సీరియస్ గా ఉండాలనుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ నేపథ్యంలోనే వార్తలొస్తున్నాయి.

గతంలో యాక్ట్రెస్ ను మ్యారేజ్ చేసుకున్న నాగచైతన్య..ఈసారి మాత్రం నటితో వివాహం చేసుకోవడానికి ముందే నో చెప్పేశాడని టాక్. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ తో నాగచైతన్య సీరియస్ లవ్ లో ఉన్నాడని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే మరో తార ‘మజిలీ’ ఫిల్మ్ కో స్టార్ దివ్యా కౌశిక్‌తోనూ నాగచైతన్య లవ్ ట్రాక్ నడిపాడని గుసగుసలు వినబడ్డాయి. కానీ, వాటిలో నిజమెంతుందో అనేది తెలియరాలేదు.

ఇక ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ను కాకుండా వేరే ఇండస్ట్రీయేతర అమ్మాయి అయితే బాగుంటుందనే డెసిషన్ కు నాగచైతన్య వచ్చినట్లు వినికిడి. ఈ విషయమై అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.. నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో ఈ పిక్చర్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు యంగ్ హీరో నాగ చైతన్య. విక్రమ్ కుమార్ తో ‘థాంక్యూ’ ఫిల్మ్ షూట్ కంప్లీట్ చేసిన నాగచైతన్య..ఓ తమిళ్-తెలుగు రెండు భాషల్లో ఓ చిత్రం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news