Jersey: నేనిప్పుడే బతుకుతున్నా..నాని ఎమోషనల్ డైలాగ్..‘జెర్సీ’ డిలీటెడ్ సీన్ రిలీజ్

-

నేషనల్ అవార్డ్ అందుకున్న బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘జెర్సీ’ని బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హిందీ రీమేక్ లో లీడ్ రోల్ ప్లే చేయగా, ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరియే దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రంలో కథా నాయకుడు నేచురల్ స్టార్ నాని. ఆయన నటించిన చిత్రాల్లో ది బెస్ట్ వన్ ‘జెర్సీ’ అని చెప్పొచ్చు.

ఈ పిక్చర్ లో నాని నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక, కాగా, ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా..తెలుగు ప్రేక్షకులందరి ఫేవరెట్ ఫిల్మ్ అయిపోయింది. ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండటంతో పాటు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.

ఇక ఈ సినిమాలో ఉండాల్సిన ఓ సీన్ ఎడిటింగ్ లో భాగంగా కట్ అయిపోయిందని, ఈ నేపథ్యంలో చిత్రం విడుదలై మూడేళ్లను సందర్భంగా మూవీ టీం మళ్లీ రిలీజ్ చేసింది. యూట్యూబ్ లో విడుదలైన ఈ రెండున్నర నిమిషాల వీడియోలో నాని ఎమోషనల్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. ఎమోషనే ఈ సినిమా ప్రధాన బలం అని చెప్పడానికి ఈ రెండు నిమిషాల సీన్ చాలు అని చెప్పొచ్చు. హిందీ ‘జెర్సీ’ ఫిల్మ్ ఈ నెల 22న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news