బోయపాటి – బాలకృష్ణ సినిమాలో మరో ట్విస్ట్…!

-

బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని గురించి మనం అనుమాన పడక్కర్లేదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్ర ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజీవ్ దత్ విలన్ పాత్ర చేయనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఓ తాజా వార్త నెట్టింట్లో షికార్లు కొడుతుంది. ప్రస్తుతం కరోనా వల్ల సినిమాలు థియేటర్ లో విడుదల అయ్యే పరిస్థితులు లేవు.

bb3
bb3

దింతో భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీనితో బాలయ్య చిత్ర నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి సినిమా బడ్జెట్ ని తగ్గించుకునే పనిలో ఉన్నారు. అందుకని సంజయ్ దత్ పాత్ర ప్రశ్నార్థకం అయిపోయింది. అతి తక్కువ మొత్తం లో రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రస్తుతానికి సరి పెట్టాలన్న ఆలోచనలో ఉంది ఈ చిత్ర యూనిట్. సంజీవ్ దత్ కి అయితే పారితోషకం భారీగా ఇవ్వాలి కనుక దింతో ఇప్పుడు వారి ఉద్దేశం మార్చుకోబుతున్నారు. కాబట్టి సంజీవ్ దత్ ఈ చిత్రం లో ఉండక పోవచ్చు అనే అంటున్నారు సినీ జనాలు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎం.రత్నం మాటలు, సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడం తో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.  సినిమా కోసం బాలయ్య భారీగా బరువు తగ్గారు. అంతే కాదు, ఈ సినిమా లో ఆయన రెండు డిఫరెంట్ షేడ్స్‌ లో కనిపించనున్నారని కూడా వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news