సెప్టెంబర్ 30న చిరంజీవి ‘గాడ్ ఫాదర్’..రిలీజ్ డేట్ ఫిక్స్?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఆచార్య’గా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అయితే, ఆ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

‘ఆచార్య’ తర్వాత విడుదలయ్యే చిత్రం ‘గాడ్ ఫాదర్’ అని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. మాలీవుడ్(మలయాళ) సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ వగా వస్తున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవి చెల్లెలిగా లేడీ సూపర్ స్టార్ నయనతార, కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు.

దసరా కానుకగా ఈ చిత్రం విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సెప్టెంబర్ 30న ఫిల్మ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్. చూడాలి మరి..ఈ వార్త నిజమవుతుందో..లేదో..

Read more RELATED
Recommended to you

Latest news