యాక్షన్ షెడ్యూల్ షురూ..చిరంజీవి సినిమా లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తున్న ‘భోళా శంకర్’ ఫిల్మ్ ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

చిరంజీవికి జోడీగా ఇందులో హీరోయిన్ గా తమన్నా భాటియా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ షెడ్యూల్ స్టా్ర్ట్ అయింది. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ లు ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఫైట్స్ కంపోజ్ చేశారని సమాచారం.

ఫిల్మ్ లో ఇంపార్టెంట్ అయిన ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం స్పెషల్ సెట్స్ ను వేసి మరి షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, డడ్లీ సినిమాటోగ్రాఫర్. మెహర్ రమేశ్ ఈ సినిమాలో కామెడీ సీన్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు వినికిడి. ఓ వైపున సెంటిమెంట్ ఉంటూనే మరో వైపున యాక్షన్, కామెడీ సీన్స్ ను హైలైట్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా నుంచి అప్ డేట్ వచ్చే అవకాశముందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news