ఆస్కార్ బరిలో RRR..

-

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ గ్రాండియర్ RRR. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ఈ పిక్చర్ లో రామ్ చరణ్, తారక్ నటించారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది.

బాక్సాఫీసు రికార్డులన్నిటినీ తిరగరాసిన RRR..రూ.1,100 కోట్లు కలెక్ట్ చేసిన సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా వైడ్ గానే కాదు పాన్ వరల్డ్ వైడ్ ..సినిమాకు విశేష ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా OTTలో స్ట్రీమవుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జీ5లో, హిందీలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమవుతోంది. ఈ సినిమాను ఆస్కార్ బరిలో నిలపాలని ఇండియన్ సినిమా లవర్స్ కోరుతున్నారు.

సినీ రంగంలో ప్రెస్టీజియస్ గా భావించే 95 అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో RRR ఫిల్మ్ ను నామినేట్ చేయాలని భారతీయ సినీ ప్రేక్షకులు కోరుతున్నారు. నామినేషన్స్ కు మాత్రమే ఈ సినిమా పరిమితం కాదని, డెఫినెట్ గా అవార్డు గెలుచుకుంటుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని భారతీయ సినీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వచ్చే ఏడాది మార్చిలో లాస్ ఏంజిల్స్ లో జరగనుంది. చూడాలి మరి..RRR ..ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు గెలుచుకుంటుందో..లేదో..

Read more RELATED
Recommended to you

Latest news