Nidhhi Agerwal: చూపులతోనే కుర్రకారును గుచ్చి గుచ్చి చంపుతున్న అందాల ‘నిధి’ అగర్వాల్!

అందాల తార నిధి అగర్వాల్..యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, ఇందులో నిధి అగర్వాల్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇక ఆ తర్వాత ఈ భామకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా‌లో లీడ్ రోల్ ప్లే చేసిన నిధి ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ‘సిలక సిలక’ అంటూ చిందులేసి కుర్రకారును ఉర్రూతలూగించింది. ప్రజెంట్ ఈ సుందరి…మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సంగతులు పక్కనబెడితే..సోషల్ మీడియాలో నిధి చాలా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో వైట్ టాప్ లో దిగిన సూపర్ హాట్ ఫొటోలు షేర్ చేసింది. అలా కాలు పైకి లేపి ఫొటో లకు ఫోజులిచ్చింది. సదరు ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అవి చూసి నెటిజన్లు ‘సో క్యూట్ బేబీ..వెరీ హాట్, అందాల ‘నిధి’., సూపర్బ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)