ఇప్పుడు శృతిహాసన్.. అప్పుడు సిమ్రాన్.. ఏ హీరోకి అదృష్టం..!!

అసలు విషయంలోకి వెళ్తే.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. కారణం సంక్రాంతి బరిలో టాప్ హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ ఉండడమే దీనికి కారణం.. చిరంజీవి హీరో గా రూపొందుతున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి రెండు సినిమాలు కూడా సంక్రాంతి పండుగ బరిలో కొదమ సింహంలా పోటీ పడుతున్నాయి. చిరంజీవి సినిమాకి బాబీ దర్శకుడు కాగా బాలయ్య సినిమాకు గోపీచంద్ మలినేని డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యపోయే మరొక విషయం ఏమిటంటే .. ఈ రెండు సినిమాలలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉండడం గమనార్హం.

ఇదిలా ఉండక 2001 సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగకు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకే రోజున ఒకే హీరోయిన్ తో రెండు సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా మృగరాజు సినిమాలో చిరంజీవి, నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ పోటీ పడడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాలలో కూడా సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. అయితే చిరంజీవి సినిమాలో హోమ్లీ క్యారెక్టర్ చేసిన సిమ్రాన్.. బాలకృష్ణ సినిమాలో గ్లామర్ డాల్ గా కనిపించి మురిపించింది. మొత్తానికి సంక్రాంతి బరిలో దిగిన వీరిద్దరిలో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే ఇప్పుడు దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇదే సీన్ రిపీట్ కాబోతోంది. ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడనున్నారు అయితే ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అప్పట్లో సిమ్రాన్ నటించి.. బాలకృష్ణకు లక్కీ హ్యాండ్ గా మారింది అయితే ఇప్పుడు రెండు సినిమాలలో ఒకే హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరికి లక్కీ హ్యాండ్ గా శృతిహాసన్ మారనుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమా విజయం సాధిస్తుంది ? ఎవరు పై చేయి సాధిస్తారు? అనేది తెలియాల్సి ఉంది.