పాన్ ఇండియా రిపేర్స్‌కు బయలుదేరిన కొరటాల శివ-తారక్..NTR 30 అప్‌డేట్

-

‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తోన్న ఫిల్మ్ ‘NTR 30’. గతంలో తారక్-కొరటాల కాంబోలో ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బాస్టర్ కాగా, ఈసారి పాన్ ఇండియా వైడ్ ఫిల్మ్ చేయబోతున్నారు. ఈ నెల 20న(శుక్రవారం) తారక్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే గురువారమే NTR 30 అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్.

ట్విట్టర్ వేదికగా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ‘NTR 30’ కి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో హై ఇంటెన్సిటీతో తారక్ చెప్తున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదని, అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని ..వస్తున్నా…’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీడియోలో చెప్పాడు.

కత్తులు పట్టుకుని.. అలా సముద్రంలో నిలబడి ఉన్న తారక్ కు.. ఇలా హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.. అని సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను నందమూరి కల్యాణ్ రామ్ ప్రజెంట్ చేస్తుండగా, ఎన్టీ రామారావు, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ పిక్చర్ కు టాప్ టెక్నీషియన్స్ రత్నవేలు, సాబు సిరిల్ , అనిరుధ్ పని చేస్తు్న్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news