ట్రెండ్ ఇన్: NTR30కి టాప్ టెక్నీషియన్స్..కొరటాల శివ మాస్టర్ ప్లాన్

-

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న NTR30 అప్ డేట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, వారికి సర్ ప్రైజ్ ఇచ్చేశారు డైరెక్టర్ శివ. ఈ నెల 20న తారక్ బర్త్ డే సందర్భంగా అప్ డేట్ ఇస్తారని అందరూ అనుకుంటున్న క్రమంలో ఒక రోజు ముందరే అప్ డేట్ ఇచ్చారు.

ఎన్టీఆర్ 30 కి సంబంధించిన ఫస్ట్ అనౌన్స్ మెంట్ వీడియో అఫీషియల్ గా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కాగా, ఈ పిక్చర్ అప్ డేట్ కోసం సినీ అభిమానులు, ఎన్టీఆర్ వీరాభిమానులు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా #NTR30 హ్యాష్ ట్యాగ్ ఎన్టీఆర్ 30ని వరుసగా ట్వీట్ చేశారు. అలా నెటిజన్ల వరుస ట్వీట్లతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఇక ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ ను ఎంచుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ మాటలు ఆసక్తి రేపుతున్నాయి. సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ‘‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదని, అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని ..వస్తున్నా…’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు.

కత్తులు పట్టుకుని.. సముద్రంలో నిలబడి ఉన్నాడు తారక్..హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.. ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను నందమూరి కల్యాణ్ రామ్ ప్రజెంట్ చేస్తుండగా, ఎన్టీ రామారావు, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ పిక్చర్ కు టాప్ టెక్నీషియన్స్ రత్నవేలు, సాబు సిరిల్ , అనిరుధ్ పని చేస్తు్న్నారు. ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 ఫిల్మ్ రాబోతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news