ఆర్ఆర్ఆర్ సినిమా విశ్వ సినీ యవనికపై సత్తా చాటింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారిగా బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్‌ను వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాటకు పురస్కారం దక్కింది. ఈ వేడుకకు హాలీవుడ్ సినీ తారలతో పాటు నామినేట్ అయిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారలంతా హాజరయ్యారు.
అంతకుముందు తారలంతా రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు బ్లాక్ కలర్ శర్వాణీలో రెడ్ కార్పెట్‌పై నడించారు. అయితే రెడ్ కార్పెట్‌పై యాంకర్‌కు, ఎన్టీఆర్‌కు మధ్య ఫన్నీ సంభాషణ చోటుచేసుకుంది. అదేంటంటే..?
ఎన్టీఆర్ ధరించిన దుస్తుల స్పెషాలిటీ గురించి యాంకర్ అడిగింది. ఎన్టీఆర్ షర్ట్‌పై ఉన్న పులి బొమ్మను చూసి దాని గురించి ఆరా తీసింది. దానికి సమాధానమిస్తూ ఎన్టీఆర్.. ‘ఇది నా ఫ్రెండ్ గౌరవ్ అరోరా డిజైన్ చేసిన డ్రెస్సు. ఆస్కార్ రెడ్ కార్పెట్ నేను మాత్రమే కాదు నాతో పాటు ఇండియా నడవాలనే ఉద్దేశంతో ఈ డ్రెస్‌ను డిజైన్ చేయించాను. ఇదిగో పులిని చూశారు కదా.. ఇది ఆర్ఆర్ఆర్ సినిమా’లో నాతో కలసి దూకిన పులియే. ఇండియాలో జాతీయ జంతువు పులి. అందుకే భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నేను ఈ వస్త్రధారణలో వచ్చాను.’ అని ఎన్టీఆర్ చెప్పారు.
India walks the red carpet at The Oscars with NTR @tarak9999 #Oscars #Oscars95 #RRRMovie pic.twitter.com/jVgTsPCznk
— …. (@ynakg2) March 13, 2023