ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మించిన సినిమా ఎన్.టి.ఆర్ కథానాయకుడు. బయోపిక్ లో మొదటి పార్ట్ గా వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రలో బాలయ్య మెప్పించినా వసూళ్ల రూపంలో మాత్రం రాబట్టలేకపోయాడు. 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఎన్.టి.ఆర్ బయోపిక్ ఫుల్ రన్ లో 20 కోట్లను మాత్రమే రాబట్టింది.
అంటే అక్షరాల 50 కోట్ల లాస్ అన్నమాట. అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాలను తలదన్నేలా ఎన్.టి.ఆర్ కథానాయకుడి డిజాస్టార్ మూవీగా నిలిచింది. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ కథానాయకుడు సినిమా ఫెయిల్యూర్ నందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఫెయిల్యూర్ కారణంగా రాబోతున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టారు దర్శక నిర్మాతలు.
ఏరియాల వారిగా ఎన్.టి.ఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలక్షన్స్..
నైజాం : 3.90 కోట్లు
సీడెడ్ : 1.80 కోట్లు
ఉత్తారంధ్ర : 1.98 కోట్లు
ఈస్ట్ : 1.14 కోట్లు
వెస్ట్ : 1.35 కోట్లు
గుంటూరు : 2.90 కోట్లు
నెల్లూరు : 0.90 కోట్లు
ఏపి/తెలంగాణా : 15.37 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.50 కోట్లు
ఓవర్సీస్ : 3.75 కోట్లు
వరల్డ్ వైడ్ : 20.62 కోట్లు