ముఖ్యమంత్రిగా హాజరై పురోహితుడై పెళ్లి వేడుక జరిపించిన ఎన్టీఆర్.. ఆ మ్యారేజ్ ఎవరిదంటే?

-

సీనియర్ ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు నటుడు, నాయకుడిగానే కాదు దేవుడిగా ఆరాధిస్తారు. వెండితెరపైన దేవుళ్ల పాత్రలను పోషించిన ఎన్టీఆర్ కు తెలుగు నాట ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ తెలుగు ఇళ్లల్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా, రాముడిగా ఉన్న ఫొటోలనే పెట్టుకోవడం మనం చూడొచ్చు కూడా. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేశారు.

సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ సీనియర్ ఎన్టీఆర్ విజయం అందుకున్నారు. ఎన్టీఆర్ కాషాయ బట్టల్లో అలా నడిచి వస్తుంటే దేవుడే వస్తున్నాడని ఆనాడు ప్రజలు అనుకునేవారు. ఈ సంగతులు పక్కనబెడితే..ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకనాడు పూజారి కూడా అయ్యారు. ఆ సంగతేంటో ఇవాళ తెలుసుకుందాం.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1998 జూలై 7న సినీ పరిశ్రమకు చెందిన నాగభైరవ కోటేశ్వరరావు వారి ఇంట పెళ్లికి ముఖ్య అతిథిగా వెళ్లారు ఎన్టీఆర్. ఆ టైమ్ లో వధూవరులను ఆశీర్వదించిన ఎన్టీఆర్.. నాగభైరవ కోటేశ్వరరావును పిలిచి ‘కవిగారూ’ అని అంటూ తనకు చెవిలో ఏదో చెప్పారు. అంతే స్టేజీ పై నుంచి అక్కడున్న పురోహితుడు కిందకు వెళ్లారు. అప్పుడు ఎన్టీఆర్ యే పురోహితుడు అయిపోయారు. అలా ముఖ్యమంత్రి పురోహితుడై వీరబాబు-పద్మజల పెళ్లి జరిపించారు.

ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అలా పెళ్లి జరిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ లో ఈ కోణం కూడా ఉందా? అని చర్చించుకున్నారు. భార్యా భర్తల అన్యోన్యత, దాంపత్యం గురించి సంస్కృతంలో మంత్రాలు చదువుతూనే వాటి అర్థం వివరించారు సీనియర్ ఎన్టీఆర్. అలా ఎన్టీఆర్ చేసిన తొలి, చివరి వివాహం అదే కావడం గమనార్హం. అలా సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెళ్లి జరిపించడం అప్పట్లో సంచలనమైంది. సీనియర్ ఎన్టీఆర్..నట వారసులిగా బాలయ్య ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news