మహేష్ సినిమాలో సీనియర్ హీరోయిన్..?

-

భరత్ అనే నేను తర్వాత మహేష్ మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ను ముగ్గురు బడా నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఈమధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ కాగా.. అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.

ఇక వీరే కాదు సినిమాలో మహేష్ తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద నటిస్తున్నారని టాక్. ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు లతో ఆడిపాడిన జయప్రద ముఖానికి మేకప్ వేసుకుని చాలా రోజులవుతుంది. ఒకవేళ మహేష్ సినిమాలో ఆమె నటించడం నిజమే అయితే ఆమె ఫ్యాన్స్ కు ఇది గొప్ప శుభవార్తే.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో మహేష్ గడ్డం లుక్ తో అదరగొట్టడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news