Ori Devuda : రేపటి నుంచే ఓటీటీలో ‘ఓరి దేవుడా’.. స్ట్రీమింగ్ టైమింగ్స్ ఇవే?

-

విశ్వక్‌సేన్ క‌థానాయ‌కుడిగా వెంక‌టేష్ అతిథి పాత్రలో న‌టించిన ‘ఓరి దేవుడా’ గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ప‌తాకంపై తెర‌కెక్కడం, ప్రచార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఓ మై కడవులే చిత్రానికి ఇది రీమేక్.

ఈ సినిమాతో మిథిలా పాల్కర్, ఆశాభట్ కథానాయికలుగా పరిచయమయ్యారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఫాంటసీ టచ్ తో నడుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ పై అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఓరి దేవుడా’ సినిమాను ఆహాలో ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి ప్రసారం చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news