పవన్ కల్యాణ్, అనుష్క జంటగా రావాల్సిన సినిమా..చివరి నిమిషంలో అలా జరిగిందట..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా వస్తుందంటే చాలు..ఆయన అశేష అభిమానులు ఆ పిక్చర్ చూసేందుకు ఆత్రుతతో ఎదురు చూస్తారు. ఇక ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ ఒక్క హీరోయిన్ అనుకుంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓ కార్యక్రమంలో తాను పవన్ కల్యాణ్ తో యాక్ట్ చేయాలని అనుకుంటున్నానని అనుష్క శెట్టి చెప్పింది. కానీ, అది జరగలేదు.

నిజానికి పవన్ కల్యాణ్-అనుష్క జంటగా ఫైనల్ అయి ఒక సినిమా రావాల్సింది. కానీ, అది ఎక్కడ ఆగిపోయిందో ఇక్కడ తెలుసుకుందాం. పవన్ కల్యాణ్ తో ‘సుస్వాగతం’ చిత్రం తీసిన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఆ తర్వాత ఆయనతో ‘అన్నవరం ’ ఫిల్మ్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా భీమినేని ..అనుష్కను ఫిక్స్ అయ్యారు. కానీ, అప్పటికే చిరంజీవి ‘స్టాలిన్’ పిక్చర్ లో అనుష్క ఓ సాంగ్ చేసింది. దాంతో నెక్స్ట్ ఆప్షన్ గా ఆసిన్ ను అనుకున్నాడు దర్శకుడు.

అలా అనుష్క స్థానంలో హీరోయిన్ గా ఆసిన్ వచ్చింది. అలా పవన్ కల్యాణ్ కు జోడీగా ‘అన్నవరం’లో ఆసిన్ నటించింది. అలా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం అనుష్కకు మిస్ అయింది. చెల్లి సెంటిమెంట్ ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ మూవీలో సంధ్య..పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించింది. శివబాలాజీ సంధ్యకు జోడీగా నటించాడు. ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

pawan kalyan anna varam film
pawan kalyan anna varam film

ఎమోషనల్ సీన్స్ లో పవన్ కల్యాణ్ యాక్టింగ్ చాలా బాగుందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. కాగా, మొత్తంగా సినిమా మాత్రం యావరేజ్ అని కొందరు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడనే అభిప్రాయం కూడా వ్యక్తమయింది.