రామ్ చరణ్ తో సినిమాపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లారిటీ..

టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. 2019 ఎన్నికల తరువాత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలో పవన్‌ ఓ రీమేక్‌ సినిమాతో సందడి చేయబోతున్నాడన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆదాయం కోసం సినిమాలు నిర్మిస్తానని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ ఓ సినిమా నిర్మిస్తానని తెలిపారు.

 

ఆ సినిమాకు ద‌ర్శ‌కుడు ఇంకా దొర‌క‌లేదని, ఈ కారణంగానే ఆలస్యం అవుతుందని తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని చెప్పారు. కాగా, సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయ కార్యక్రమాలపైనే పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. ఆయన హీరోగా ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘పింక్’ సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. నిర్మాతగా మాత్రం సినిమాలు తీయాలని ఆయన భావిస్తున్నార‌ట‌.