పవన్ కల్యాణ్ స్థానంలో శ్రీకాంత్ మేక..ఆ సూపర్ హిట్ పిక్చర్ ఏంటో మీకు తెలుసా?

-

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ మేక ..వందకు పైగా చిత్రాలు చేశారు. ప్రజెంట్ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఓ సూపర్ హిట్ ఫిల్మ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం అనుకున్న పాత్రను శ్రీకాంత్ పోషించారు. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయింది కూడా. ఆ సినిమా ఏంటి? అందులోకి శ్రీకాంత్ మేక ఎలా వచ్చారు? అనే సంగతులు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి తో హీరో శ్రీకాంత్ కు ఉన్న అనుంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సమయంలో శ్రీకాంత్ ఇక ఇండస్ట్రీని వదిలి వెళ్లాలని అనుకున్నపుడు చిరంజీవి అతినికి ధైర్యం చెప్పి సినిమాలు చేయాలని సూచించాడు. అలా శ్రీకాంత్ మేక.. చిరంజీవిని సొంత అన్నయ్యలాగా భావిస్తారు. వీరిరువురు కలిసి నటించిన తొలి చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’.

బాలీవుడ్ సూపర్ హిట్ పిక్చర్ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ కు రీమేక్ గా వచ్చిన ఈ పిక్చర్ లో చిరంజీవి.. ఏజ్ ఎక్కువైపోయిన మెడికల్ స్టూడెంట్ రోల్ ప్లే చేశారు. దాదాగిరి చేస్తూ తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలనుకుంటాడు. ఇక ఈ సినిమా స్టోరిలో ట్విస్టులు, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్..సిల్వర్ స్క్రీన్ పైన బాగా వర్కవుట్ అయి సినిమా సూపర్ హిట్ అయింది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇందులో చిరంజీవి తమ్ముడిగా శ్రీకాంత్ మేక ‘ఏటీఎం’ పాత్రలో కనబడి ప్రేక్షకులను కడుపుబ్బ నవిస్తారు. అయితే, ఈ పాత్రకు తొలుత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యమిచ్చారు మేకర్స్. కానీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్పుడు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ పాత్రను శ్రీకాంత్ మేకకు ఇచ్చారు.

అలా పవన్ కల్యాణ్ స్థానంలో శ్రీకాంత్ మేక నటించి సూపర్ హిట్ పిక్చర్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవియే తన రైట్ హ్యాండ్ పాత్ర ‘ఏటీఎం’ పోషించాలని శ్రీకాంత్ మేకకు చెప్పారట. అలా దర్శకుడి ని ఒప్పించి శ్రీకాంత్ కు ఈ సినిమాలో అవకాశమిచ్చారు. అలా వెండితెరపై చిరంజీవి-శ్రీకాంత్.. కాంబినేషన్ ను చూసి ప్రేక్షకులు హ్యాపీగా ఫీలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news