పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు చేస్తూ.. మరొక వైపు రాజకీయరంగంలో చాలా వేగంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండూ కూడా సూపర్ హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు.. హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొక సినిమా , సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే హరహర వీరమల్లు అలాగే భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ లు మొదలైన విషయం తెలిసిందే.
భవదీయుడు భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలకు సురేందర్రెడ్డి దర్శకత్వంలో తాళ్లూరి రామ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం, సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో సినిమా షూటింగ్ లు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇక వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేయాలనే ఆలోచనతో దర్శక నిర్మాతలు ఉన్నారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతలు నష్టపోకుండా త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మరి త్వరగా షూటింగ్ పూర్తి చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.