BIG BOSS-7 : హీరో నాగార్జునను అరెస్ట్ చేయాలని పిటిషన్ !

-

హీరో నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. BIGG BOSS షోకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునను అరెస్టు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. బిగ్ బాస్ పేరుతో అక్రమంగా 100 రోజులు నిర్బంధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ ఈ పిటిషన్ వేశారు.

బిగ్ బాస్ లో పాల్గొన్న వారిని సైతం విచారించాలన్న పిటీషనర్….. ఆర్టీసీ సహా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వెనుకున్న కుట్రను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఇక అటు పబ్లిక్ న్యూసెన్స్ కు కారణమైన బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసులు మూడు బృందాలతో గాలింపు చేపట్టారు. ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకొని అతడి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొల్లూరుకు చెందిన ప్రశాంత్… కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ టీం ను అక్కడకు పంపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version