మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో బుట్ట బొమ్మ..మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. ఇటీవల డేరింగ్ అండ్ డ్యాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’లో హీరోయిన్ గా ఎంపికైన ఈ భామ..మరో క్రేజీ ప్రాజెక్టులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేయనుంది.

ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలీవుడ్ స్టార్..ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తీయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ..డీసీ టాలెంట్ కంపెనీ ప్రొడ్యూస్ చేయనుంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు ప్రకటించారు.

పూజా హెగ్డే..నటించిన చిత్రాలు ఇటీవల విడుదలై…బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, ఈ భామకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘జన గణ మన’లో నటించనున్న ఈ సుందరి..బాలీవుడ్ ఫిల్మ్స్ లోనూ తన సత్తా చాటుతోంది.