Pooja Hegde: రూ. 100 కోట్ల దెయ్యం సినిమాలో పూజాహెగ్డే ?

-

 

Pooja Hegde signs Kanchana 4: రూ. 100 కోట్ల దెయ్యం సినిమాలో పూజాహెగ్డే నటించనున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కాంచన సినిమా మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కాంచన సిరీస్ లో ఇదివరకే ముని, కాంచన 2, గంగా అనే మూడు సిరీస్ లో వచ్చాయి. ఈ మూడు సిరీస్ లు బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాయి. ప్రస్తుతం కాంచన 4 సిరీస్ ను తెరకెక్కించడానికి ముహూర్తం ఖరారు చేశారు. కాంచన 4 ను రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.

Pooja Hegde

ఈ సినిమాను గోల్డ్ మైన్ మూవీస్ సంస్థ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. కాంచన 4 సినిమాకు డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా హీరోగా కూడా రాఘవనే నటించనున్నారు. గత మూడు సిరీస్ లలో రాఘవ హీరోగా అద్భుతంగా నటించాడు. నాలుగవ సిరీస్ లో కూడా రాఘవనే నటించాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేశారట. దీని గురించి పూజా హెగ్డేను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version