ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా ఓటీటి , బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలా గుర్తింపు పొందిన షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. మంచి టిఆర్పి రేటింగ్ ను అందుకునే ఈ షోపై ఎంతోమంది కమెడియన్లు కామెడీ చేసి పలు సినిమాలలో అవకాశాలను దక్కించుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కమెడియన్ అప్పారావు కూడా ఒకరు. ప్రస్తుతం బుల్లితెరవైపు కామెడీ చేస్తూనే వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే జబర్దస్త్ రేటింగ్ పడిపోవడం పై అప్పారావు క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి చూద్దాం.
జబర్దస్త్ మొదట 2013 వ సంవత్సరంలో మొదలుపెట్టగా దాదాపుగా ఏడేళ్ల పాటు ఈ షోకు కాసుల వర్షం కురిసింది అని తెలియజేశారు. దీంతోపాటుగా ఈ షో కి కొంతమంది సినీ యాక్టర్లు కూడా రావడం మొదలుపెట్టారు. సినిమాలలో అవకాశాలు లేని వారికి కూడా జబర్దస్త్ బాగానే అవకాశాలు కల్పించింది అని తెలియజేశారు. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కు, ఒక కమెడియన్ కి దాదాపుగా పదివేలకు పైగా పారితోషకం అందుతుందని అప్పారావు తెలిపారు. అలా ఇప్పుడు కొంతమంది టీం లీడర్లకు కూడా మారారని తెలిపారు.
ఇలా భారీ స్థాయిలో రేటింగ్ అందుకున్న ఈ షో ఒక్కసారిగా డౌన్ అవ్వడం జరిగింది. ఇక అందులో ఉండే పలువురు కమెడియన్సు కూడా వెళ్ళిపోతూ ఉండడంతో మరింత జోరు తగ్గిపోయిందని తెలిపారు అప్పారావు. ఆ షోలో నుంచి బయటికి వెళ్లాలని అప్పారావు నిర్ణయించుకున్నప్పుడు.. అందులో కనీసం నిర్వాహకులు ఎందుకు వెళ్తున్నారు అని ఒక్క మాట కూడా అడగలేదట ఒక సీనియర్ కమెడియన్ పై గౌరవం కూడా చూపించలేదని అప్పారావు తెలియజేయడం జరిగింది. గతంలో ఎంతమంది సీనియర్ కమెడియన్స్ కష్టపడి ఆ షో రేటింగును పెంచడానికి చాలా కష్టపడే వారని తెలిపారు. దాదాపుగా అన్ని షోలకంటే 18 రెట్లు ఎక్కువగా వచ్చేది కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరు ఆ షో నుంచి వీడడంతో రేటింగ్ కూడా చాలా పడిపోయింది అని అప్పారావు తెలిపారు. అంతేకాకుండా ఈ షోలో కొంతమంది దారుణమైన ప్రవర్తన కారణంగా ఈ షో నుంచి చాలామంది కమెడియన్లు వెళ్లిపోయినట్లుగా అప్పారావు తెలియజేయడం జరిగింది.