ఫైనల్ గా బాలీవుడ్ మూవీని ఓకే చేసిన ప్రభాస్…??

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల సూపర్ సక్సెస్ ల తరువాత బాలీవుడ్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ సంపాదించి, అమాంతం తన మార్కెట్ ని కూడా పెంచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, ఇటీవల సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది . అయితే ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఆ సినిమా, ప్రేక్షకులు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. తెలుగులో పెద్దగా సక్సెస్ కాని ఈ సినిమా, నార్త్ లో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి, బాలీవుడ్ లో ప్రభాస్ స్టామినాని రుజువు చేసింది. ఇక ఇటీవల గోపీచంద్, రాశిఖన్నాల కలయికలో వచ్చిన జిల్ మూవీని తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే మూవీలో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్నారు.

prabhas bollywood movie details
prabhas bollywood movie details

టాలీవుడ్ లో ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న పూజ హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ప్రేమ కథగా, అన్ని కమర్షియల్ హంగులతో దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ తో కలిసి ఒక బాలీవుడ్ మూవీలో ప్రభాస్ నటించనున్నట్లు సమాచారం.

ప్రభాస్ కోసం కరణ్ ఒక మంచి స్టోరీ సిద్ధం చేసారని, వాస్తవానికి ఆ కథ తాలూకు మెయిన్ థీమ్ ఎప్పుడో సిద్ధం అయిందని, అయితే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అవడానికి కొంత టైం తీసుకున్న కరణ్, ఎట్టకేలకు దానిని పూర్తి చేసి, త్వరలో ప్రభాస్ ని కలిసి స్టోరీ ఫైనలైజ్ చేయనున్నట్లు టాక్. అంతేకాక ప్రభాస్ కూడా కరణ్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో ఎంతో మక్కువగా ఉన్నారని, దీనిని బట్టి ప్రభాస్ తొలిసారి బాలీవుడ్ లో నటించబోయే సినిమా ఖాయమైనట్లేనని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది…..!!