పూజా హెగ్డేతో లిప్ లాక్ సీన్ : ప్రభాస్ హాట్ కామెంట్స్ !

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరో గా నటిస్తున్న లెటెస్ట్‌ మూవీ రాధేశ్యాం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా మార్చి 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమంలో చిత్రబృందం ఫుల్ బిజీ అయిపోయింది. అయితే ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ప్రభాస్ లిప్ లాక్ సీన్ ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రొమాంటిక్ సీన్లలో నటించడం ఇప్పటికీ ఇబ్బందిగానే ఫీల్ అవుతాం అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

“రాధేశ్యాం లవ్ మూవీ. కమర్షియల్ మూవీ అయితే రొమాంటిక్ సీన్లను కట్ చేయవచ్చు కానీ ఇలాంటి సినిమాల్లో తప్పదు. పూజా హెగ్డే తో లిప్ లాక్ సీన్లలో చాలా ఇబ్బందిగా అనిపించింది. సెట్ లేకుండా నటించాల్సి వచ్చింది. సెట్స్ లో చాలామంది ఉన్నారు… దాంతో వేరే లొకేషన్ కు వెళ్లి మరీ షూట్ చేపించాను.”అంటూ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news