Prabhu Deva: భయంకరమైన అవతారంలో ప్రభుదేవా..ఆసక్తికరంగా ‘మై డియర్ భూతం’ ఫస్ట్ లుక్

-

కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ప్రభుదేవా..గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగా రాణిస్తూనే మరో వైపున దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా సత్తా చాటుతున్నాడు. తెలుగులోనూ పలు సినిమాలు చేసిన ప్రభుదేవా…మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశాడు.

ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ్ ఫిల్మ్ ‘మై డియర్ భూతం’ తెలుగులోనూ విడుదల కానుంది. ఈ పిక్చర్ ను తెలుగులో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్నారు. ఈ ఫిల్మ్ ను అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ పై బాలాజీ ప్రొడ్యూస్ చేశారు.

ఎన్.రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సురేశ్ మీనన్, రమ్య నంబీసన్ కీలక పాత్రలు పోషించారు. డి.ఇమ్మాన్ మ్యూజిక్ అందించగా, సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్. ఫాంటసీ చిత్రంగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభదేవా మెజీషియన్ రోల్ ప్లే చేస్తున్నట్లు కనబడుతోంది. వైట్ డ్రెస్సులో పొడవాటి కర్రవంటి వస్తువు పట్టుకుని ప్రభుదేవా డిఫరెంట్ అవతారంలో కనిపిస్తున్నారు. ప్రభుదేవా వెనుక ఉన్న బాలుడు అలా తొంగి చూస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news