రోమ్ వీధుల్లో ప్రియాంక, నిక్ జోనస్ రొమాన్స్..

-

అందాల భామ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి రోమ్ వెకేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఎంజాయ్ చేస్తూన్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్నారు. కాగా పబ్లిక్​లోనే వీరు లిప్​ లాక్​ చేస్తూ కనిపించారు. ఈ ఫోటోను ప్రియాంక ఇంస్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్‌ ‍ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. కాగా ప్రస్తుతం రోమ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెకేషన్ కి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ప్రియాంక సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్నారు. ఇది చూసిన ఆమె అభిమానలంతా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ను 2018 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం జోద్పూర్ లో ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. జనవరి 2022లో సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కూతురికి మాల్టీ మేరీ అని పేరు పెట్టారు.

ప్రస్తుతం ప్రియాంక రూసో బ్రదర్స్​ తెరకెక్కిస్తున్న సిటాడెల్​ వెబ్​ సిరీస్​లో నటిస్తున్నారు. ఇటీవలే లండన్​లో జరిగిన సిటాడెల్​ ప్రీమియర్​లోనూ తన భర్త నిక్​ జొనాస్​తో పాల్గొన్నారు. ఈ వెబ్​ సిరీస్​లో రిచర్డ్​ మాడెన్​కు జంటగా ప్రియంక నటించారు. అలాగే ఈ వెబ్ సిరీస్ ఇండియన్​ వెర్షన్​లో సమంత, వరుణ్​ ధావన్​ నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్‏లో స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version