పుష్ప 2 టీంకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. పుష్ప 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రలో కూడా ఒకరోజు ముందే డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు పుష్ప ప్రీమియర్ షోస్ ఉండనున్నాయి.
ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800 హైక్ చేసింది ఏపీ సర్కార్. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ కంటే రూ.200 అధికంగా హైక్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100 అధికంగా పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం.
ఇక టికెట్ ధరలు పెంచడంపై అల్లు అర్జున్ స్పందించారు. సీఎం గారికి… డెప్యూటీ సీఎం గారికి థాంక్స్ అంటూ పోస్ట్ చేశారు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా టికెట్స్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భారీ హైక్ ఇవ్వడంపై అల్లు అర్జున్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడుకు థాంక్స్ చెప్తూ బన్నీ ట్వీట్ చేశారు.