రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయాలనుకున్న సినిమా ఇదే..

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుల్లో ఒకరైన రాఘవేంద్రరావుకు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. దర్శకేంద్రుడు గా పేరు గాంచిన ఆయన వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్, వెంకటేశ్ వంటి స్టార్స్ ను హీరోలు గా ఇంట్రడ్యూస్ చేసిన రాఘవేంద్రరావు.. ఇటీవల ‘పెళ్లి సందD’ చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు.

హీరోలతో పాటు హీరోయిన్స్ ను ప్రత్యేకంగా వెండితెరపైన చూపించే సత్తా ఉన్న దర్శకుడు రాఘవేంద్రరావు. కమర్షియల్ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన రాఘవేంద్రరావు సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలా మంది హీరోలతో పని చేశారు. ఇక హీరోయిన్స్ ను అయితే చాలా మందిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో పని చేయాలని ప్రతీ ఒక్కర నటీ నటులు అనుకునేలా ఆయన పని చేశారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. దర్శకుడిగా తాను ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తే బాగుండని రాఘవేంద్రరావు అనుకున్నారు. ఆ చిత్రం ఏమిటంటే.. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘బాగ్ మిల్కా బాగ్’.

మిల్కా సింగ్ జీవితం ఆధారంగా ఫర్హాన్ అక్తర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తే బాగుండని అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు చెప్పారు. రాఘవేంద్రరావు ప్రస్తుతం పలు సినిమాలకు గౌరవ దర్శకత్వం వహిస్తుండటంతో పాటు గెస్ట్ అప్పియరెన్స్ లు ఇస్తు్న్నారు. త్వరలో ఆయన మళ్లీ డైరెక్టర్ గా ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news