‘అర్జున్ రెడ్డి’లా మారిన రాహుల్ రామకృష్ణ..అమ్మాయికి లిప్ లాక్ ఇచ్చి సంచలన ప్రకటన!

-

టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ తాజాగా ‘అర్జున్ రెడ్డి’లా మారిపోయాడు. అవునండీ మీరు చదివింది నిజమే..రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాదిరిగా రఫ్ గా తయారై ఓ అమ్మాయికి లిప్ లాక్ ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే తన గురించి ఓ సంచలన ప్రకటన చేశాడు. వివరాల్లోకెళితే..

‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇక ఆ తర్వాత వరుసగా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.

ఇటీవల విశ్వక్ సేన్-టీవీ 9 యాంకర్ నాగవల్లి మధ్య జరిగిన వివాదంపైనా రాహుల్ రామకృష్ణ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమయింది. కాగా, తాజాగా రాహుల్ రామకృష్ణ బోల్డ్ గా తన మ్యారేజ్ గురించి అనౌన్స్ చేయడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ టౌన్ అయిపోయింది.

అర్జున్ రెడ్డి మాదిరిగానే తాను కూడా మారిపోయాడా అన్నట్లుగా రాహుల్ రామకృష్ణ..తను మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయికి లిప్ లాక్ ఇచ్చిన ఫొటో షేర్ చేసి ‘‘త్వరలో పెళ్లికి సిద్ధం’’ అని క్యాప్షన్ రాశాడు. అది చూసి నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇటీవల విడుదలైన RRR సినిమాలో కీలక పాత్రను రాహుల్ రామకృష్ణ పోషించాడు.

Read more RELATED
Recommended to you

Latest news