రజనీకాంత్.. స్టోరి, స్క్రీన్ ప్లే ఇచ్చిన ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇదే..

-

స్టైల్ కు కేరాఫ్, తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కు హీరోగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. అయితే, ఆయనలో రచయిత కూడా ఉన్నారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కాగా, ఆయన స్వయంగా స్టోరి, స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు ఆ పిక్చర్ ను ప్రొడ్యూస్ కూడా చేశారు. ఆ ఫిల్మ్ విశేషాలు తెలుసుకుందాం.

రజనీకాంత్ ‘బాబా’ సినిమాకు స్టోరి ఇచ్చారని అందరికీ తెలుసు. కానీ, ఆయన ఓ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ కు స్టోరి ఇచ్చారని తక్కువ మందికి తెలుసు. ఆయన స్టోరి తో పాటు స్క్రీన్ ప్లే అందించిన చిత్రం ‘విజయ’. తమిళ్ లో ‘వల్లి’ అనే టైటిల్ తో ఈ సినిమా విడుదల కాగా తెలుగులో మాత్రం ‘విజయ’ అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను బాగా అలరించింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు ఆదరణ లభించింది.

ఈ చిత్రంలో రజనీకాంత్ స్పెషల్ క్యారెక్టర్ కూడా ప్లే చేశారు. తెలుగులో ఈ సినిమాను బి.నాగిరెడ్డి సమర్పించారు. విజయా వారు విడుదల చేయగా, ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. కె.నటరాజ్ దర్శకత్వం వహించగా, సూపర్ స్టార్ రజనీకాంత్ స్టోరి, స్క్రీన్ ప్లే అందించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ లో ఓ రైటర్ కూడా ఉన్నాడన్న సంగతి ఈ స్టోరి చదివిన తర్వాత ప్రతీ ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. రజనీ ప్రస్తుతం ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్’ పిక్చర్ చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news