బీజేపీతో టీడీపీ…రాజగురువు సెట్ చేసేశారా!

-

తెలంగాణలో అమిత్ షా పర్యటన పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే…కేవలం మునుగోడు ఉపఎన్నిక కోసమే అమిత్ షా తెలంగాణకు రాలేదని అర్ధమైపోతుంది..ఊహించని విధంగా ఎన్టీఆర్‌తో, రామోజీరావుతో అమిత్ షా భేటీ అవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. మునుగోడు సభ తర్వాత…దారిలో రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళి..అక్కడ రామోజీరావుతో షా భేటీ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు.

కేవలం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన నచ్చి…ఆయన్ని అభినందించడానికే షా భేటి అయ్యారని అంటున్నారు..అలా అనుకుంటే రాజమౌళి, రామ్ చరణ్ లతో కూడా భేటి కావాల్సి ఉంటుంది..ఎన్టీఆర్ తో భేటి వెనుక రాజకీయ కోణం కూడా ఉండే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్‌తో భేటి అనేది మీడియాలో బాగా హైలైట్ కావడంతో రామోజీరావుతో భేటి హైలైట్ కాలేదు.

మునుగోడు సభ ముగిసిన అనంతరం షా నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. తర్వాత రామోజీరావుతో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దాదాపు 45 నిమిషాల పాటు రామోజీ రావు, అమిత్‌షా భేటీ జరగనున్నట్లు తెలిసింది.

అయితే టీడీపీకి రాజగురువు అని వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది…చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి రామోజీరావు తెగ కష్టపడుతున్నారని విమర్శిస్తుంటారు. ఇలాంటి తరుణంలో రామోజీరావుతో షా భేటి కావడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే బీజేపీకి దగ్గర కావాలని బాబు తెగ ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు బాబుని దగ్గరకు రానివ్వని బీజేపీ..ఈ మధ్య కాస్త దగ్గర అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షా…ఎన్టీఆర్‌తోనే కాకుండా రామోజీరావుతో భేటి అవ్వడం పెద్ద హాట్ టాపిక్ అయింది. మళ్ళీ బాబుని బీజేపీకి దగ్గర చేయడంలో రామోజీరావు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మారుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news