టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌తో కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించినా హిందీలో మాత్రం ఫుల్ బిజీగా గడుపుతోంది.

ఇప్పటికే హిందీలో అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. తాజాగా ఛత్రివాలీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నే రకుల్ బిజీబిజీగా ఉంది.

అలాగే ఫిట్‌నెస్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందీ అమ్మడు. ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఓ గంటైన జిమ్ లో కసరత్తులు చేస్తుంది. ఫిట్ నెస్ పై ఈ భామకు మక్కువ ఎక్కువ. అందుకే ఎఫ్45 పేరుతో జిమ్ కూడా ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.
