Acharya: పదేళ్లు డ్యాడీ ఆ హ్యాపీనెస్ మిస్సయ్యారు: రామ్ చరణ్

-

తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దర్శకులు కొరటాల శివ, రామ్ చరణ్ తాజా ఇంటర్వ్యూలో ఆచార్య పిక్చర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి బోలెడన్ని విషయాలు చెప్పారు. ‘ఆచార్య’ టైంలో తండ్రీ తనయుల మధ్య జరిగిన సంభాషణలను పూసగుచ్చినట్లు చెప్పే ప్రయత్నం చేశారు చెర్రీ.

వెండితెర మీద తండ్రీ తనయుల కలయిక అత్యద్భుతంగా ఉండబోతుందన్న సంగతి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బలమైన కథతో పాటు కమర్షియల్ యాంగిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చిరంజీవికి సెట్ అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా కొరటాల శివ చెప్పారు. షూటింగ్ అయిపోయినప్పటికీ ఆయన సెట్ లోనే ఉండే వారని చెప్పుకొచ్చారు.

దాదాపు పదేళ్ల పాటు సెట్ లో ఉండే సంతోషాన్ని చిరంజీవి మిస్ అయ్యారని ఈ సందర్భంగా రామ్ చరణ్ తెలిపారు. చిరంజీవి పదేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న టైం గురించి రామ్ చరణ్ చెప్పారు. తన తండ్రి చిరంజీవికి సెట్స్ ఫస్ట్ హోం అని, ఇళ్లే సెకండ్ హోం అని అన్నారు మెగా పవర్ స్టార్. తను దాదాపు నాలుగేళ్ల నుంచి వేరు ఇంట్లో ఉంటున్నానని, ‘ఆచార్య’ వలన నెల రోజుల పాటు తన తండ్రితో కలిసి ట్రావెల్ చేసే అదృష్టం లభించిందన్నారు ‘చిరుత’ చిత్ర హీరో.

ఈ సందర్భంగా దర్శకులు కొరటాల శివకు థాంక్స్ చెప్పారు చరణ్. ఈ నెల 23న తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటల తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతున్నదని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ లు ముఖ్య అతిథులుగా వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news