అమెరికాలో రాంచరణ్ సూపర్ హంగామా..!!

-

రామ్ చరణ్ జూ ఎన్టీఆర్ హీరోలుగా, దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ సంచనాలకు హద్దే లేకుండా పోతుంది. దేశం వరకే పరిమితం అనుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రపంచంలో టాక్ అఫ్ ది టౌన్ అయింది. ఇప్పటికే ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ మూవీ అనేక అవార్డులు సాధిస్తోంది.ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును రీసెంట్ గా అందుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయి స్టార్స్ గా అయ్యారు. గతంలో జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కోసం వెళ్ళారు. ఇప్పుడు అక్కడ వసూళ్ల లో టాప్ లో ఉంది. . తాజాగా మరోసారి రామ్ చరణ్ కాలిఫోర్నియాలో జరిగిన ఒక అవార్డు వేడుకకు చరణ్ హాజరు అయ్యాడు. బ్లాక్ సూట్ లో హలీవుడ్ హీరోగా మెరుస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో RC15 వర్కింగ్ టైటిల్ పై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ సినిమా  పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే  బుచ్చి బాబుతో రామ్‌ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతాడు.  ఇండియన్ యాక్టర్స్ లో  ప్రభాస్ తర్వాత రామ్ చరణ్  మాత్రమే పాన్ ఇండియా సినిమాల తో హల్చెల్ చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news