టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి తనయుడిగా హీరోగా సినీ ఇండస్ట్రీకి ‘చిరుత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. కాగా, ప్రజెంట్ ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తండ్రికి తగిన తనయుడే కాదు మించినవాడని నిరూపించుకుంటున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చరణ్ పర్ఫార్మెన్స్ చూసిన మెగా అభిమానులు ఆయన నటనకు ఫిదా అయిపోయారు. చిరంజీవి పేరును నిలబెట్టడమే కాదు.. పదింతలు రెట్టింపు చేయగల సామర్థ్యం చెర్రీకి మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. రామ్ చరణ్ ను కలిసేందుకు ఫ్యాన్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేచి చూస్తుండటం మనకు తెలుసు. కానీ, ముంబైలోనూ ఆయన్ను కలిసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తాజాగా ఓ పని నిమిత్తం అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రామ్ చరణ్ సౌత్ ముంబైకు వెళ్లారు.
అక్కడ రామ్ చరణ్ ఊపిరి ఆడనంత మంది ఆయన్ను చుట్టుముట్టారు. రామన్న రామన్న..అంటూ కేరింతలు కొడుతూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఆయనతో సెల్ఫీ దిగాలని ఎగబడ్డారు. ముంబైలోని బాంద్రా గెయిటీ గెలాక్సీలో ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంలో రామ్ చరణ్ బౌన్సర్లు కూడా ఏం చేయలేకపోయారు.
చరణ్ ను కలిసేందుకు ఫ్యాన్స్ గుమిగూడి, ఆయన కారును చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ముంబై సినీ ప్రేక్షకులకు, బాలీవుడ్ వారికి రామ్ చరణ్ ఇంతకు ముందే సుపరిచితం ‘జంజీర్’ రీమేక్ లో ఆయన నటించారు. అయితే, ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. కాగా, ఇప్పుడు మాత్రం మల్టీస్టారర్ అయినప్పటికీ చరణ్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతంగా పెరిగింది. అలా క్రేజ్ కా బాప్ రామ్ చరణ్ అయిపోయాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.