ఆస్కార్ వేడుకల్లో మెరిసిన రామ్ చరణ్ దంపతులు..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ , ఉపాసన జోడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరికీ దాదాపు వివాహం జరిగి 10 సంవత్సరాల అవుతున్న చాలా అన్యోన్యంగా తమ వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే అటు సినిమాలపరంగా ఇటు ఫ్యామిలీ పరంగా చాలా సంతోషంగా ఉన్న రామ్ చరణ్ కు ఒక వెలితి ఉండేది. ఇంకా పిల్లలు పుట్టలేదని ప్రశ్న ఎప్పటికప్పుడు అభిమానుల నుంచి తలెత్తుతూ ఉండేది. కానీ ఎట్టకేలకు గత ఐదు నెలల క్రితం ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉపాసన ఆరు నెలల గర్భవతి ఇలాంటి సమయంలో ఆమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవానికి తమ కడుపులో బిడ్డతో సహా హాజరై సందడి చేశారు. ముఖ్యంగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో రామ్ చరణ్ , క్రీమ్ కలర్ బ్యూటిఫుల్ డిజైనింగ్ శారీలో ఉపాసన దర్శనమిచ్చి అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇండియా నుంచి వచ్చిన ఈ జంట మోస్ట్ లవ్లీ కపుల్ గా రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. మొత్తానికైతే వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు అక్కడ చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు రామ్ చరణ్, ఉపాసన. ఇంతటి అరుదైన గుర్తింపు లభించడం నిజంగా ఇండియన్ యాక్టర్స్ గా వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news