ఈ సారి లవ్ స్టోరీ తో రామ్ చరణ్ ఈ కుర్ర డైరెక్టర్ కి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాడా ..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా మరో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఏ డైరెక్టర్ తో కమిటౌతాడా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ అయినప్పటికి చాలా మందికి విపరీతంగా నచ్చిన సినిమా ‘ఆరెంజ్’. ఒక డిఫ్రెంట్ కాన్స్పెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రామ్ చరణ్ కి చాలా ఇష్ఠమని చాలా సార్లు చాలా సందర్భాలలో వెల్లడించారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సినిమా రామ్ చరణ్ నుంచి రాలేదు. ఒక రకంగా మళ్ళీ ఇలాంటి కథ తో ప్రయోగం చేయలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

 

 

సుమంత్ ‘మళ్లీ రావా’- నేచురల్ స్టార్ నాని తో ‘జెర్సీ’ సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ స్క్రిప్ట్ వినిపించినట్లు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కుర్ర డైరెక్టర్ కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీని రామ్ చరణ్ కి వినిపించారని తాజా గా తెలుస్తుంది. ఈ లవ్ స్టోరీ నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. పంజాబీ అమ్మాయి.. దక్షిణాది అబ్బాయి మధ్య ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని రాసి గౌతమ్ వినిపించారట. ఈ పాయింట్ పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ కి యూనిక్ గా అనిపించి ఈ ప్రాజెక్ట్ లాక్ చేసినట్లు తాజా సమాచారం. ఇక గౌతమ్ మేకింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనదైన శైలి ఎమోషన్ ని పీక్స్ లో చూపించగల సత్తా ఉందని జెర్సీ సినిమాతో నిరూపించాడు.

మళ్లీ రావా.. జెర్సీ చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు దక్కడం వెనక గౌతమ్ సెన్సిబిలిటీ కూడా ముఖ్య కారణాలు అని తెలిసిందే. ఇక తాజాగా రామ్ చరణ్ కి వినిపించిన ప్రేమకథలోనూ ఆ ఎమోషన్స్ బాగా ఉన్నాయట. ఇక ఇప్పటికే రామ్ చరణ్ లిస్ట్ లో ప్రదీప్ అనే కొత్త కుర్రాడు కూడా రీసెంట్ గా చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే స్క్రిప్టు వినిపించగా మెగాస్టార్ కి కూడా బాగా నచ్చి లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆ ఇద్దరిలో ఎవరికి కాల్షీట్లు ఇస్తాడో చూడాలి. ఇక విక్రం కె కుమార్ కూడా లైన్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news