టాలీవుడ్ దర్శకుడు రాం గోపాల్ వర్మ…సంచనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నేతల బయోగ్రఫీ లపై సినిమాలు తీస్తూ ఉంటారు వర్మ. ఇక తాజాగా మరో వివాదాస్పద పోస్ట్ చేశాడు వర్మ. వాలంటైన్స్ డే నేపథ్యంలో లవర్స్ కు దిశా నిర్దేశం చేశాడు వర్మ.
“ప్రేమలో పడినప్పుడు మెదడు పనిచేయడం మానేస్తుంది. అందుకే చాలా మంది ప్రయాణికులు మూగ వాళ్లు అవుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఉత్తమం. మీకోసం మరొకరిని నమ్మి ప్రయోజనం లేదు. మీ కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కనుగొనే వరకు మాత్రమే ఒక రోజు నిన్ను ప్రేమిస్తారు. హృదయం రక్తం పంపింగ్ చేయడమే చేయాలి. ప్రేమ ఆంటీ అనవసరమైన విషయాలలో పాల్గొనకూడదు. నిజమైన ప్రేమ పిల్లలు అలాగే కుక్కలతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే అది బాధ పెట్టలేవు. మెదడులో ప్రేమించడం మాత్రమే ఎందుకంటే హృదయంతో ప్రేమించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ ప్రేమ విఫలమైతే జీవితమే పోతుంది” అంటూ వర్మ ట్వీట్ చేశారు.